పులివెందుల: కడప జిల్లా పులివెందుల ప్రజల మనోబావాలను దెబ్బ తీసే విధంగా పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్ లో పవన్ కల్యాణ్ మీద ఎస్ఐ గోపీనాథ్ కు ఫిర్యాదు చేశారు. 

ఆ తర్వాత వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పులివెందుల గడ్డ అంటేనే ప్రమకు, అభిమానానికి, పౌరుషానికి పుట్టిల్లు అని ఆయన అన్నారు. మన రాష్ట్రానికి ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలు అందించారని అన్నారు. 

టీడీపీ, బిజెపి ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్ కల్యాణ్ కు పులివెందుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పవన్ కల్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆనయ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల గూండాలకు ఎంత కాలం భయపడుతామని, వారి దౌర్జన్యాలను ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ సనివారం తిరుపతి బహిరంగ సభలో వ్యాఖ్యానించారు పులివెందుల దుర్మార్గాలకు, దోపిడీకీ కేరాఫ్ ఆడ్రస్ గా మారిపోయిందని అన్నారు