మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల సీఐపై వేటు పడింది. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నా పట్టించుకోకుండా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ శంకరయ్యను సస్పెండ్ చేస్తూ కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.

తన సమక్షంలోనే వివేకా కుటుంబసభ్యులు ఘటనాస్థలంలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎస్పీ తెలిపారు. శవ పంచనామా పూర్తి కాకుండా పులివెందుల ఆసుపత్రికి తరలిస్తున్నా శంకరయ్య పట్టించుకోలేదన్నారు.

వివేకా హత్య జరిగిన వెంటనే రక్తపు మరకల్ని కడిగేయటంతో కీలకమైన ఆధారాలు దొరికే అవకాశాలు తగ్గిపోయాయని పోలీసులు తెలిపారు.