Asianet News TeluguAsianet News Telugu

పులిచింతలలో ప్రారంభమైన స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు.. ట్రయల్ విజయవంతం

పులిచింతల ప్రాజెక్ట్‌‌లో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. స్టాప్ లాక్‌లో ఒక భాగం ట్రయల్ విజయవంతమైంది. ఇదే క్రమంలో గేటు ఊడిపోయిన ప్రాంతంలో ఇనుప చట్రాలను అమర్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు

pulichintala project stoplock works began ksp
Author
Pulichinthala Project, First Published Aug 6, 2021, 8:25 PM IST


పులిచింతల ప్రాజెక్ట్‌‌లో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. స్టాప్ లాక్‌లో ఒక భాగం ట్రయల్ విజయవంతమైంది. ఇదే క్రమంలో గేటు ఊడిపోయిన ప్రాంతంలో ఇనుప చట్రాలను అమర్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. స్టాప్ లాక్స్ ద్వారా వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నారు. 

మరోవైపు పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడంపై ఏపీ సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో విచారించాలని ఆదేశించింది ప్రభుత్వం.తాత్కాలికంగా స్టాప్‌ లాక్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.2003లో పులిచింతల కాంట్రాక్టును టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు  అప్పటి  చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. ప్రాజెక్టు పనులు నాసిరకంగా ఉన్నాయని 2015లో ఎస్‌డీఎస్‌ఐటీ తేల్చి చెప్పింది.

Also Read:పులిచింతలలో నీటి మట్టం తగ్గింపునకు చర్యలు: స్టాప్ గేటు బిగింపునకు చర్యలు ప్రారంభం

గ్రౌటింగ్‌ చేసేందుకు 24 బోర్లు తవ్వి వదలేయడం వల్ల స్పిల్‌ వేలో భారీ ఎత్తున లీకేజీలు  ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు.
దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఇచ్చిన నివేదికను  అప్పటి సర్కార్‌ బుట్టదాఖలు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగానే 16వ గేటు ఊడి పోయిందంటోన్న అధికార వర్గాలు చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios