Asianet News TeluguAsianet News Telugu

పులిచింతల ప్రాజెక్ట్: అడుగంటిన నీటిమట్టం.. బయటపడిన 16వ నెంబర్ గేట్

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్ట్ 16వ నెంబర్ గేటు జాడ దొరికింది. ప్రాజెక్ట్‌కు 750 మీటర్ల దూరంలో ఇది లభించింది. నీరు ఖాళీ చేయడంతో నదీ గర్భం నుంచి ఇది బయటపడింది. దీనిని గమనించిన జాలర్లు అధికారులకు సమాచారం అందించారు. 

pulichintala project 16th no gate found ksp
Author
pulichintala, First Published Aug 7, 2021, 3:17 PM IST

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్ట్ 16వ నెంబర్ గేటు జాడ దొరికింది. ప్రాజెక్ట్‌కు 750 మీటర్ల దూరంలో ఇది లభించింది. నీరు ఖాళీ చేయడంతో నదీ గర్భం నుంచి ఇది బయటపడింది. దీనిని గమనించిన జాలర్లు అధికారులకు సమాచారం అందించారు. 

కాగా, పులిచింతల ప్రాజెక్టు 16 వ గేట్ తొలగి 58  గంటలు అవుతోంది. స్టాఫ్ లాక్ ఏర్పాటు కోసం మరో 6 గంటలు పట్టే అవకాశం ఉంది.  స్టాప్ లాక్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. స్టాఫ్ లాక్ ఏర్పాటు కోసం నిపుణులు బృందం తీవ్రంగా పనిచేస్తోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద రిటైర్డ్  ఇంజనీరింగ్ అధికారులు, నిపుణులు సూచనలిస్తున్నారు. నిన్నటినుంచి నీరు పోతుండడంతో పులి చింతల ప్రాజెక్ట్ లో నీటి వనరులు అడుగంటాయి. ఇంకా చెప్పాలంటే.. పులిచింతల జలాశయం  దాదాపుగా ఖాళీ అయినట్టే. 

Also Read:పులిచింతల ప్రాజెక్టులో అడుగంటిన నీటి మట్టం.. 58 గంటలుగా కొనసాగుతున్న పనులు..

పులిచింతల పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం జలాశయంలో 5.18 టీఎంసీలు మాత్రమే నీరు మిగిలి ఉంది. 53 మీటర్ల నుంచి 38.20మీటర్లకు నీటి మట్టాలు పడిపోయాయి. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 15 వేల క్యూసెక్కులు. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి రెండు  58వేల క్యూసెక్కుల నీరు విడుదల. కాగా, పులిచింతల ప్రాజెక్ట్‌‌లో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు శుక్రవారం శరవేగంగా ప్రారంభమయ్యాయి. స్టాప్ లాక్‌లో ఒక భాగం ట్రయల్ విజయవంతమైంది. ఇదే క్రమంలో గేటు ఊడిపోయిన ప్రాంతంలో ఇనుప చట్రాలను అమర్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. స్టాప్ లాక్స్ ద్వారా వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios