దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికలో నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిల పేర్లు లేకపోవడంత.. వివాదం తలెత్తింది. ఎంపీల పేర్లు కూడా.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యవహరించిన తీరుపట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జ

ఈ విషయంలో మాజీ మంత్రి హరిరామజోగయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావడం లేదని తేల్చిచెప్పారు. ఆహ్వాన పత్రిక.. టీడీపీ పోస్టర్ లా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్ లో జరగాల్సి ఉంది.

ఈ విషయంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య మాట్లాడారు. దర్శకరత్న దాసరి అందరివాడన్నారు.  ఏ పార్టీలో కొనసాగిన ఆయనను అందరూ అభిమానిస్తారని చెప్పారు.

 పాలకొల్లులోని ప్రముఖులందరం కలిసి దాసరి కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం విరాళాలు ప్రకటించామని చెప్పారు.  స్థానిక ఎమ్మెల్యేను గౌరవించాలనే ఉద్దేశంతో నిమ్మలను కార్యక్రమంలో ముందుండాలని కోరామన్నారు. కానీ, ఇవాళ ప్రకటించిన ఇన్విటేషన్‌ చూస్తే.. అది పక్తు టీడీపీ పోస్టర్‌లా ఉందని మండిపడ్డారు. అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.  దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం బాగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.