Asianet News TeluguAsianet News Telugu

టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలి:కేతిరెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగావ మారిపోయిందని సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భ్తకులకు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఆర్టీఐ పరిధిలో ఉంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం లేదన్నారు. 

producer kethireddy jagadeeswarareddy demonds for ttd in rti limits
Author
Tirupati, First Published Sep 25, 2018, 5:16 PM IST

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగావ మారిపోయిందని సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భ్తకులకు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు ఆర్టీఐ పరిధిలో ఉంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం లేదన్నారు. ఆర్టీఐ పరిధిలోకి తిరుమల తిరుపతి దేవస్థానం రాకుండా కేసులు వేశారంటూ మండిపడ్డారు. 

రాజకీయ అవసరాలకోసం ,మోసాల నిమిత్తం కోర్టులో స్టేలు తెచ్చారని ఆరోపించారు. టీటీడీలో కొన్ని సంవత్సరాలుగా భక్తులను నిలువుదోపిడికి గురిచేస్తున్నారన్నారు. ఆర్జిత సేవ టిక్కెట్లు బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా  లభ్యమవుతున్నాయన్నారు. చెన్నై,ముంబై, బెంగళూరు నగరాలకు చెందిన కొందరు దళారులు ఆర్జిత సేవా టిక్కెట్లలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

సీఎం చంద్రబాబు వెంటనే పాలకమండలికి ఈ- కోటా విధానం ను రద్దు చెయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రోటోకాల్ విధానాన్నిరద్దు చేసి వారు వారి కుటుంబ సభ్యులు వస్తే మాత్రం దర్శనాలు కల్పించేలా నూతన సంస్కృతికి నాంది పలకాలని కోరారు. 

ఈ- కోట విధానం వల్ల దళారుల వ్యవస్థ ఎక్కువగా ఉందన్నారు.ఈ ఆర్జిత సేవ కుంభకోణలను వెలికి తియ్యాల్సిన విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ మెప్పుకోసం అప్పుడప్పుడు ఎప్పుడో పట్టుకున్న వారిని పట్టుకుని జిమ్మిక్ లు ఆడుతున్నారని అన్నారు. 

తిరుమల పవిత్రతను కాపాడాల్సిన విజిలెన్స్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ అధికారులు కొండపై చిరు వ్యాపారులకు అక్రమ వడ్డీకి డబ్బులు ఇస్తూ వారి అక్రమాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. టీటీడీ ఎన్నో కుంభకోణలు ,మోసాలు, నిలువుదోపిడీలకు అడ్డాగా మారిపోయిందన్నారు. తిరుమలలో మద్యం, సిగరెట్లు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్నారు. 

తిరుపతిలో మధ్యపాన నిషేధం, మాంసాహార నిషేధం చేస్తే సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. కొండమీద పేరుకు మాత్రమే ఆన్ లైన్ అని మిగిలినది అంతా క్యాష్లైన్ అన్నారు. తిరుపతిలో పరిపాలన భవనం ఉన్నప్పటికీ బోర్డ్ మీటింగ్ లు కొండపైనే జరుగుతున్నాయని విమర్శించారు. సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మోసాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

తిరుమలలోని అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితో అయినా విచారణ చేపట్టాలని డిమాండ్ చేవారు. సీఎం చంద్రబాబు ప్రాణాలు కాపాడిన వెంకన్నపేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్టవేసి తిరుపతి వాసిగా రుణం తీర్చుకోవాలని చంద్రబాబును కోరారు. వెంకన్న పేరుతో దోపిడీలు చేస్తున్నదళారి వ్యవస్థను రూపుమాపి వెంకన్నరుణం తీర్చుకోవాలని కోరారు. 

పాలకమండలి సభ్యులు ఒక నెలంతా విడతాలవారిగా కొండపై ఉండి అక్కడ జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కృషి చెయ్యాలని కేతిరెడ్డి కోరారు. బోర్డ్ మీటింగ్ లు కొండపై జరుగుతున్నప్పుడు సకుటుంబ సపరివారంగా లేదా పారిశ్రామిక వర్గాల నుంచి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు చేసుకుంటూ అధికారాలను అనుభవిస్తున్నారన్నారు.  అధికారుల దృష్టిలో బోర్డ్ సభ్యులు ఆలయంను పునర్నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయలు సంతతికి చెందిన వారిలా భక్తులను నెట్టివేయడం జరుగుతుందని మండిపడ్డారు. 

అధికారులు ,పాలకమండలి సభ్యులు వెంకన్న భక్తులకు ఆధ్యాత్మిక భావంను పెంపొందిచేందుకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్వామి వారి వజ్రాలు అపహరణకు గురయ్యాయని జరుగుతున్న ప్రచారం భక్తులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్నారు. 

తమను రక్షించే దేవుడు శ్రీనివాసుడంటూ వచ్చే భక్తులకు ఈ ప్రచారం అడ్డంకిగా మారనుందన్నారు. వజ్రాల విషయంలో భక్తులకు వాస్తవాలు తెలియజెయ్యాలని అలాగే టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios