కర్నూల్ జిల్లా అహోబిలంలో దంపతులు అదృశ్యమయ్యారు. అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన దంపతులు కన్పించకుండా పోయారు.
కర్నూల్: కర్నూల్ జిల్లా ఎగువ Ahobilamలో couple అదృశ్యమయ్యారు. అదృశ్యమైన దంపతులు Kadapa జిల్లా Proddaturకు చెందినవారుగా గుర్తించారు. అహోబిలం ఆలయానికి వచ్చిన దంపతులు అదృశ్యమైనట్టుగా గుర్తించారు. ఈ దంపతులు ఎక్కడికి వెళ్లారనే విషయమై police గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు రోజుల క్రితం దంపతులు అహోబిలం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చిన దంపతుల సమాచారం లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
