టూ వీలర్ ఆశ చూపి యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితులు చిక్కారిలా...

Probing robbery, cops stumble on 6-month-old gang-rape
Highlights

బెంగుళూరులో యువతిపై గ్యాంగ్ రేప్ బయటపడిందిలా


బెంగుళూరు: ద్విచక్రవాహనం ఇప్పిస్తామని  ఓ యువతికి మాయమాటలు చెప్పి గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడిన ఘటన ఆరు మాసాల తర్వాత  వెలుగు చూసింది.  ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతిపై అత్యాచారానికి పాల్పడిన మహాలక్ష్మీ లేఔట్‌ నివాసులు భరత్‌, ప్రమోద్‌, హరీష్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల కిందట దుండగులకు ఆ యువతి పరిచయమైంది. ద్విచక్రవాహనం ఇస్తామని ఆశచూపించారు. 

నిందితుల మాటలను నమ్మిన ఆ యువతి  వారి వెంట వెళ్ళింది.  బాధిత యువతిని  మాండ్య, తమకూరు ప్రాంతాల్లో తిప్పి నిర్మానుష్యంగా  ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ విషయమై  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.కానీ ఆమెను అప్పుడప్పుడూ ఈ విషయమై బెదిరింపులకు పాల్పడేవారు.

అయితే   ఈ ముగ్గురు నిందితులు ఇటీవల కాలంలో ఓ దొంగతనం కేసులో  అరెస్టయ్యారు. విచారణ సమయంలో గ్యాంగ్ రేప్ విషయాన్ని కూడ నిందితులు బయటపెట్టారు.  అయితే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం  ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

loader