శ్రీకాకుళం: యువకుడితో వివాహిత సంబంధం ఒకరి ప్రాణాలు తీసింది. మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకొంది.

జిల్లాలోని లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల ప్రియాంక అలియాస్ అంకమ్మ, సంతోష్ లు సోమవారం నాడు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియాంక మరణించింది. సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ప్రియాంకకు 12 ఏళ్ల క్రితం సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. సూర్యనారాయణ ఓ ప్రైవేట్ కంపెనీలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ప్రియాంక కూలీ పనులు చేసేది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. 

మూడేళ్ల క్రితం ఆటో డ్రైవర్ సంతోష్ తో ప్రియాంకకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం స్థానికులతో పాటు భర్తకు తెలిసింది. దీంతో భర్త పంచాయితీ పెట్టాడు. అయినా కూడ ప్రియాంక మారలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. బంధువులు, స్థానికులు చెప్పినా కూడ వీరిద్దరూ తమ సంబంధాన్ని కొనసాగించారు.

దీంతో వీరిద్దరూ చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు రాత్రి కేశవరాయనిపాలెం నుంచి చిలకపాలెం చేరుకొన్నారు. సమీపంలోని తోటలోకి వెళ్లి పురుగుల మందు తాగారు.  ఈ విషయాన్ని స్నేహితులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు తోటల్లో వెతికారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రియాంక మరణించింది. సంతోష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్గం కోసం తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.