పృథ్వీ ఐటీ సొల్యూషన్స్ ఎండీ ఉప్పలపాటి సతీష్ ను ఈడీ అధికారులు గురువారం నాడు  అరెస్ట్ చేశారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మోసం చేశారని ఆయనపై కేసు నమోదైంది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారని కూడ ఆయనపై అభియోగాలున్నాయి.

హైదరాబాద్: పృథ్వీ ఐటీ సొల్యూషన్ ఎండీ ఉప్పలపాటి సతీష్‌ను గురువారం నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.బ్యాంకుల నుండి రూ.3,316 కోట్ల రుణం తీసుకొన్న కేసులో మోసం చేశారని సతీష్ పై అభియోగం.

Scroll to load tweet…

మరోవైపు మనీలాండరింగ్ కు కూడా ఆయన పాల్పడ్డారని ఆయపపై అభియోగాలున్నాయి. ఈ కేసులో సతీష్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ పలు బ్యాంకుల నుండి రూ. 3316 కోట్లను రుణాలు తీసుకొన్నాడు. నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకొన్నారని కూడ కేసు నమోదైంది.

also read:బ్యాంకుల నుండి రూ. 1207 కోట్ల రుణాలు: వీఎంసీ డైరెక్టర్ హిమబిందు అరెస్ట్, మరో ఇద్దరి కోసం లుకౌట్ నోటీసు

 నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మోసం చేశారని వీఎంసీ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఈ నెల 5న ఈడీ అధికారులు.ఈ విషయమై 2018లోనే సీబీఐ అధికారులు వీఎంసీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రూ. 539 కోట్లు, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు , కార్పొరేషన్ బ్యాంకుల నుండి రూ.1207 కోట్ల రుణాలను నకలీ పత్రాలను చూపి రుణాలు పొందారని ఈ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ డైరెక్టర్లు వెంకటరామారావు, వెంకటరమణల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.2018 నుండి బీఎస్ఎన్ఎల్ నుండి రావాల్సిన బకాయిలు వస్తే చెల్లిస్తామన్న కంపెనీ సీబీఐకి తెలిపింది. బీఎస్ఎన్‌ఎల్ నుండి వీరికి రూ. 33 కోట్లు రావాల్సి ఉంది. అయితే రూ.262 కోట్లు రావాల్సి ఉందని తమను కంపెనీ డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారని సీబీఐ ఆరోపిస్తోంది.