రాజమండ్రి సెంట్రల్ జైలులో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ కారాగారంలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించాడు. అయితే ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరం గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తిని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కోర్టు ఐదేళ్ళ కారాగార శిక్ష విధించింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులో గత సంవత్సరం నుండి శిక్ష అనుభవిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గానీ ఎవరూ చూడటానికి రాలేదు. దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

గత కొంత కాలంగా వెంకన్న ఇదే డిప్రెషన్ తో మానసిక వేదన అనుభవిస్తున్నాడు. అయితే ఇలా బ్రతకడం భారంగా భావించిన అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి సమయంలో బాత్‌రూంలోకి వెళ్లి తన పురుషాంగాన్ని కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో పడివున్న వెంకన్నను గమనించిన తోటి ఖైదీలు జైలు సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో సిబ్బంది వెంటనే వెంకన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం కోటుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.