కృష్ణాజిల్లా గన్నవరం జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ పరారవ్వడంలో కొత్త కోణం చోటు చేసుకుంది. జైలులోని ఇనుప రాడ్‌ను కోసి పక్కనే ఉన్న ఎంఆర్‌వో ఆఫీసులోకి దూకి ఖైదీ పారిపోయాడు. అయితే ఖైదీని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళుతుండగా అతను పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో గందరగోళం నెలకొంది. మరోవైపు తప్పించుకున్న ఖైదీని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.