నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఓ ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. య్యూటూబ్‌లో చూసి తాము దొంగనోట్లు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నామని నిందితులు తెలిపారు.
య్యూటూబ్.. ఇందులో అన్ని రకాలు వీడియోలు దొరుకుతాయి. మనకు ఏ వీడియో కావాలని సెర్చ్ చేస్తే సెకండ్లలో దానికి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతాయి. ఈ య్యూటూబ్ ను కొత్త విషయాలు నేర్చుకోవడం, తెలుసుకోవడం, వంటలు నేర్చుకోవడం వంటి మంచి పనుల కోసం కొందరు ఉపయోగిస్తుంటే.. మరి కొందరు మాత్రం దానిని చెడ్డపనుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈజీ మనీ ఎలా సంపాదించాలో సెర్చ్ చేసి తరువాత చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది.
దొంగనోట్లు ఎలా తయారు చేయాలని య్యూటూబ్‌లో చూసి నేర్చుకొని ఇప్పుడు కటకటాలపాలయ్యారు.
కృష్ణ జిల్లాలో వెలుగులోకి..
కృష్ణ జిల్లాలోని వీరభద్రపురానికి చెందిన కాస నాగరాజు అతని కుమారుడు ఇద్దరు కలిసి ఈజీమనీ కోసం దొంగ నోట్లు తయారుచేయాలని అనుకున్నారు. దాని కోసం య్యూటుబ్‌ను నమ్ముకున్నారు. దొంగ నోట్లు ఎలా తయారు చేయాలి ? దానికి ఎలాంటి పరికరాలు అవసరమవుతాయి ? తయారు చేసిన దొంగ నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేసి డబ్బుగా ఎలా మార్చుకోవాలనే విషయాలను య్యూటూబ్‌లో చూసి నేర్చుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆ పని చేయడం ప్రారంభించారు. దాని కోసం కలర్ జిరాక్స్ మిషన్, ల్యాప్‌టాప్ లు వంటివన్నీ సమకూర్చుకున్నారు. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. కానీ ఇలాంటి పనులు ఎక్కువ రోజులు బయటకు రాకుండా ఏం ఉండవు. వీరికి అలాంటి పరిస్థితే ఎదురైంది. వీరి ద్వారా మార్కెట్‌లోకి వెళ్లిన నోట్లను వినియోగించిన ఒకరికి ఆ నోట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ దొంగనోట్లు ముఠా గుట్టురట్టు అయ్యింది. ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేసి మీడియాకు వివరాలు అందించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న అందరినీ అరెస్టు చేశామని మచిలీపట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా తెలిపారు.
వృద్ధులకు జగన్ సర్కార్ శుభవార్త.. పెన్షన్ పెంపు, జనవరి 1 నుంచి చేతికి రూ.2,500
దొంగనోట్ల ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో పట్టణానికి చెందిన కాసా నాగరాజు ముఖ్యపాత్ర ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడి ఇంటిపై రాత్రి దాడి చేశారు. ఇందులో దొంగనోట్ల ప్రింటింగ్‌కు అవసరమయ్యే మిషన్లు, ఇతర వస్తువులు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. దొంగనోట్లు, కొంత నగదు కూడా స్వాధీనం చేసున్నారు. ఈ విషయంలో నాగరాజును పోలీసులు లోతుగా ప్రశ్నించారు. దీంతో అతడు ఈ దందాతో సంబంధం ఉన్న అందరి పేర్లు బయటపెట్టాడు. ఇందులో ఇంటర్ చదివే అతడి కుమారుడు కూడా ఉన్నాడు. య్యూటూబ్‌లో చేసే నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలని తెలుసుకున్నానని పోలీసులకు అతడు తెలిపాడు. నాగరాజుతో పాటు ఇందులో సంబంధం ఉన్న అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
