ఏపీలోని పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి సంయుక్తంగా ఈ సభను చిలకలూరిపేటలో ఏర్పాటు చేశాయి.
ఏపీలోని పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభ వేదికకు కొద్ది నిమిషాల ముందే ప్రధాని నరేంద్ర మోడీ చేసుకున్నారు. ఆయనకు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరీ స్వాగతం పలికారు.
Scroll to load tweet…
ఈ సభకు చేరుకోకముందే ఏపీ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘నేటి సాయంత్రం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తో కలిసి సభలో పాల్గొంటున్నాను. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఎన్డీయే ఏపీ ఆశీస్సులు కోరుతోంది.’’ అని ఆయన పేర్కొన్నారు.
