ఒకరోజు పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు.
ఒకరోజు పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 7న రానున్న రాష్ట్రపతి జిల్లాకు రానున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌లో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 12;10 గంటలకు రామ్‌నాథ్ కోవింద్ మదనపల్లికి చేరుకోనున్నారు. 12:30 గంటలకు స్థానిక ఆశ్రమం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
అనంతరం 3:20కు మదనపల్లి నుంచి బయలుదేరి 3:40 సదుం చేరుకొంటారు. అక్కడ పిపల్ గ్రూప్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.
అనంతరం అక్కడి నుంచి 4:50 గంటలకు బెంగుళూరుకు బయలుదేరుతారు. కాగా రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శనివారం రోజు జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.