Asianet News TeluguAsianet News Telugu

నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... పర్యటన సాగనుందిలా...

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. నేడు విజయవాడకు చేరుకోనున్న రాష్ట్రపతి విశాఖ, తిరుమల పర్యటన అనంతరం రేపు డిల్లీకి తిరుగపయనం కానున్నారు. 

President Droupadi Murmu AP Tour
Author
First Published Dec 4, 2022, 9:55 AM IST

అమరావతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పర్యటనలో భాగంగా నేడు ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే రాష్ట్రపతి పర్యటన మంగళవారం మధ్యాహ్నంతో ముగియనుంది. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి రాష్ట్రానికి విచ్చేస్తున్న నేపథ్యంలో ఆమెకు పౌరసన్మానం చేపట్టేందుకు ఏపీ ప్రజలు సిద్దమయ్యారు. నేడు అధికారిక కార్యక్రమాలను ముగించుకుని రాష్ట్రపతి తిరుమలకు చేరుకోనున్నారు. 

ఆదివారం ఉదయం 8గంటలకు న్యూడిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న రాష్ట్రపతి ముర్ము 10.15 గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడ పౌరసన్మానం, రాజ్ భవన్ లో అధికారిక విందు అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం విశాఖపట్నంకు బయలుదేరనున్నారు. సాయంత్రం వరకు విశాఖలోనే నావికాదళ కార్యక్రమాలతో వివిధ అభివృద్ది పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాత్రి విశాఖ నుండి తిరుమలకు చేరుకుని పద్మవతి అతిథి గృహంలో బసచేయనున్నారు. 

సోమవారం ఉదయం రాష్ట్రపతి ముర్ము శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11.35  గంటలకు అలిపిరి గోమందిరాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం  విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మద్యాహ్నం 1.20 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. తిరుపతిలో కార్యక్రమాలన్నింటిని ముగించుకుని మధ్యాహ్నమే రాష్ట్రపతి తిరిగి డిల్లీకి పయనం కానున్నారు 

Read More  టికెట్లు వుంటేనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈసారి స్ట్రిక్ట్‌గా : తేల్చిచెప్పిన టీటీడీ

ఇదిలావుంటే ఆదివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ముర్ము ఐఎన్ఎస్ డేగా నావల్ ఎయిర్ స్టేషన్ కు చేరుకుని అక్కడినుండి రోడ్డుమార్గంలో ఆర్కే బీచ్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 4.40 నుండి సాయంత్రం ఆరుగంటల వరకు సముద్రతీరంలో నావికాదళ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పలు అభివృద్ది పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలు చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము. 

కర్నూలు జిల్లా నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్, రాయచోటి నుంచి అంగూల్ వరకు నిర్మించిన జాతీయ రహదారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అలాగే ముదిగుబ్బ నుండి పుట్టపర్తి వరకు జాతీయ రహదారి 342 విస్తరణ పనులను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. 44, 205 నంబర్ జాతీయ రహదారుల్లో చేపట్టిన పనులకు ప్రారంభించనున్నారు. అలాగే విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలలను రాష్ట్రపతి ముర్ము ప్రారంభించనున్నారు.

సాయంత్రం రాష్ట్రపతి ముర్ము నేవీ డే వేడుకల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం నేవీ హౌస్ లో జరిగే నేవీ అధికారుల సతీమణుల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇక్కడి నుండి నేరుగా ఐఎన్ఎస్ డేగా కు చేరుకుని రాత్రి 8గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతికి పయనం కానున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వివిధ కార్యక్రమాతో రాష్ట్రపతి ఏపీ పర్యటన ముగియనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios