అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతకు ప్రక్రియ షురూ అయ్యింది. బుధవారం ప్రజావేదిక కూల్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు అక్కడకు చేరుకున్నారు. 

ప్రజావేదికలో ఉన్న ఫర్నీచర్ ను తరలించే ప్రక్రియ ప్రారంభించారు. ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామాగ్రి తరలింపుపై పలు సూచనలు చేస్తున్నారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయకృష్ణన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రికి సంబంధించిన జాబితాను సిద్ధం చేశారు. ఫర్నీచర్ ను ఏపీ సెక్రటేరియట్ లో వివిధ కార్యాలయాలలో సర్దుబాటు చేస్తున్నారు. ఇకపోతే హైకోర్టు సమీపంలోని నర్సరీకి పూల కుండీలు తరలించారు. 

మరోవైపు ప్రజావేదికలోని షెడ్డులను తొలగించేందుకు కార్మికులు షెడ్ లపై ఉన్న రేకులను తొలగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డీమాలిష్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.