గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. నమ్మించి మోసం చేసి ఓ యువకుడు తన మిత్రుడి ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ నెల 2వ తేదీన గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆస్పత్రిలో చేరిన గోపీవర్మ అనే యువకుడు శనివారం మరణించాడు. 

గుంటూరు జిల్లాలోని మర్రిపాలెం గ్రామానికి చెందినప్రేమ్ చంద్,  అదే జిల్లా యడ్లపాడుకు చెిదన గోపీవర్మ ఇద్దరు మంచి మిత్రులు. అయితే ఇద్దరు కూడా ఒకే యువతిని ప్రేమించారు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తరుచుగా ఇరువురు గొడవ పడుతూ వస్తున్నారు. 

ఇద్దరం కలిసి చనిపోదామని ప్రేమ్ చంద్ ఈ నెల 2వ తేదీన గోపీవర్మను మర్రిపాలెం గ్రామానికి పిలిచాడు.  గోపీవర్మను చంపాలని నిర్ణయించుకున్న ప్రేమ్ చంద్ తన మిత్రుడు రాగానే తాను పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగానని చెప్పి గోపీవర్మకు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాంతో గోపీవర్మ స్పృప తప్పి పడిపోయాడు. 

గోపీవర్మను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రేమ్ చంద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.