చంద్రుడి మీదకు మనిషిని పంపే స్థాయికి చేరిన భారతదేశంలో నేటికి కూడా ఏజెన్సీలో వైద్యం కూడా దొరక్క గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలోని వైద్యం కోసం 15 కిలోమీటర్లు నడిచి ఓ నిండు గర్బిణీ బిడ్డను కోల్పోయింది. వివరాల్లోకి వెళితే...పాడేరు మండలం మాదిగబంధ గ్రామానికి చెందిన గర్భిణీకి బుధవారం నొప్పులు వచ్చి ఇంట్లోనే ప్రసవం జరిగింది.

ఈ క్రమంలో పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే గర్బిణీ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుంటే బంధువులు, గ్రామస్తులు ఆమెను డోలిలో 15 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి క్షేమంగా ఉండగానే బిడ్డ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. 

Also Read:

వైసీపీకి ఏటీఎంగా మారిన కరోనా: చంద్రబాబు విమర్శ

కరోనాపై జగన్ సమీక్ష: మత్స్యకారుల క్షేమ సమాచారంపై సీఎం ఆరా