అమరావతి:కరోనా రావడం వైసీపీకి ఏటీఎంలా మారిందని ఆయన విమర్శలు చేశారు. కరోనా విపత్తు సమయంలో ప్రజలకు పార్టీ నేతలు అండగా నిలవాలని ఆయన కోరారు.

బుధవారం నాడు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజా ప్రతినిధులతో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా  స్థానిక ఎన్నికలపై వైసీపీ నేతలు దృష్టి సారించారని ఆయన విమర్శించారు. ఒట్ల కోసం వైసీపీ నేతలు గుంపులు గుంపులుగా తిరిగారని ఆయన ఆరోపించారు.

ఇష్టారీతిలో వ్యవహరించడం వల్ల కర్నూల్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.దేశంలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో కర్నూల్ జిల్లా ఒక్కటిగా నిలవడం ఆందోళన కల్గిస్తోందన్నారు.

also read:లాక్‌డౌన్ సడలింపులపై ఏపీ సర్కార్ కొత్త గైడ్‌లైన్స్: మినహయింపులు వీటికే

రైతు భరోసా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది పేర్లను తొలగించిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల అక్రమ వసూళ్లపై మండల స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని బాబు సూచించారు. 

కరోనా సమయంలో పేదలకు, రైతులకు అండగా ఉండేందుకు  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేయాలని ఆయన పార్టీ నేతలను కోరారు.