భర్త మరణాన్ని తట్టుకోలేని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.  

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణించడంతో ఆ వేదనను తట్టుకోలేని ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. భానులత అనే మహిళతో పాటు ఆమె తల్లి లక్ష్మి కూడా ఆత్మహత్య చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

చనిపోవడానికి ముందు వీరు సూసైడ్ నోట్ రాశారు. భానులత భర్త కొద్ది కాలం క్రితం మరణించాడు. దీంతో ఆ వేదనను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నెల్లూరు, విక్రమ్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.