కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి అంతా సిద్దంచేసుకున్న టిడిపి నేత వరపుల రాజా ఇటీవలే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈయన మృతి ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రభావం ఏ మేరకు వుంటుంది? ప్రత్తిపాడు ప్రజలు రాజా కుటుంబంపై సానుభూతి చూపిస్తారా? లేక వైసిపి గెలిపిస్తారా? అన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. 

ప్రత్తిపాడు రాజకీయాలు : 

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇదే ప్రత్తిపాడు నుండి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తండ్రి వీరరాఘవరావు వారసుడిగా ప్రత్తిపాడు నుండే రాజకీయ రంగప్రవేశం చేసారు ముద్రగడ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడానికి ముందే ముద్రగడ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1983 లో ప్రత్తిపాడునుండి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1985 లో కూడా టిడిపి నుండే పోటీచేసి గెలిచిన ముద్రగడ 1989 లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 

అయితే కాపు ఉద్యమాలతో చాలాకాలంగా రాజకీయాలకు దూరంగావున్న ముద్రగడ ఇప్పుడు తిరిగి రాజకీయ రంగప్రవేశానికి సిద్దమయ్యారు. పవన్ కల్యాణ్ లో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించినా ఆయన దూరం పెట్టినట్లు ఇటీవల ముద్రగడ స్వయంగా వెళ్లడించారు. తాజాగా ఆయన వైసిపిలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇదే జరిగితే కాపుల ఎక్కువగా వుండే ప్రత్తిపాడు, పిఠాపురం వంటి నియోజకవర్గాలపై ఈ ప్రభావం వుండనుంది. 

ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. శంఖవరం 
2. ప్రత్తిపాడు 
3. ఏలేశ్వరం 
4. రౌతులపూడి

ప్రత్తిపాడు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,02,743

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి మరోసారి వరపుల సుబ్బారావు బరిలోకి దిగుతున్నారు. ఆయన 2004, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 లో రాజకీయ సమీకరణల నేపథ్యంలో సుబ్బారావును పక్కనబెట్టి పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ను పోటీలో నిలిపింది వైసిపి. కానీ ఈసారి సిట్టింగ్ ను పక్కనబెట్టి సుబ్బారావును పోటీ చేయిస్తోంది వైసిసి అదిష్టానం. 

టిడిపి అభ్యర్థి :

ఇక టిడిపి వరపుల రాజా హఠాన్మరణంతో ఆయన భార్య సత్యప్రభను బరిలోకి దింపుతోంది. ప్రత్తిపాడు అభ్యర్థిగా సత్యప్రభ పేరును ఖరారు చేసారు... ఈ మేరకు రెండో జాబితాలో ప్రకటించారు.

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,02,743

వైసిపి - పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ - 76,574 (46 శాతం) - 4,666 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి -వరుపుల రాజా - 71,908 (43 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - వరపుల తమ్మయ్య బాబు - 6,907 (4 శాతం) 

ప్రత్తిపాడు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,48,075 (80 శాతం)

 వైసిపి - వరుపుల సుబ్బారావు - 63,693 (43 శాతం) - 3,413 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - పర్వత శ్రీ సత్యనారాయణమూర్తి - 60,280 (40 శాతం) - ఓటమి