సంపద సృష్టించకపోతే.. పంపిణీ ఎలా సాధ్యం?: ప్రశాంత్ కిషోర్ సంచలనం.. వీడియో వైరల్..
ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవతార్ లైవ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన షార్ప్ ఇన్‌సైడ్ అండ్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితులను జర్నలిస్టు సోమా చౌదరి ప్రస్తావించగా.. సంపద సృష్టిస్తేనే పంపిణీ చేయడానికి వీలవుతుందని అన్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌ను మీరు ఉదాహరణగా చూపారు. ఇది విషయాలను చాలా దూరం తీసుకుంటుంది. సంపద సృష్టిస్తేనే పంపిణీ చేయడానికి వీలవుతుంది. సంపద సృష్టికి ప్రభుత్వాలు అనుకూలమైన వాతావరణం కల్పించాలి. అలా సృష్టించిన సంపదను రాష్ట్రం క్రియాశీలకంగా పంపిణీ చేయాలి. సంపద సృష్టించకపోతే ప్రభుత్వాలు పంచడానికి డబ్బులు ఎలా ఇస్తాయి? ఇది అపరిమిత రుణాలకు మాత్రమే దారి తీస్తుంది. సంపద సృష్టించగలిగితేనే దానిని పంపిణీ చేయగలుతాం’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్, ఆయనకు చెందిన ఐప్యాక్ టీమ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో కూడా ఐప్యాక్ టీమ్‌ను జగన్ అభినందించారు. వైసీపీ విజయాన్ని కూడా ఐప్యాక్ టీమ్ తమ విజయంగా జరుపుతుంది. ఇప్పుడు కూడా రానున్న ఎన్నికలకు వైసీపీ కోసం ఐప్యాక్ టీమ్ పనిచేస్తుంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం సంపద సృష్టి అనేది లేకుండా.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగాలకు జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోపై వైసీపీ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.