ప్రజావేదిక భవనం కూల్చివేత ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం కలెక్టర్ల సదస్సు ముగియగానే ప్రజావేదిక కూల్చివతే ప్రక్రియను ప్రారంభించారు. రాత్రంతా ఈ ప్రక్రియను అధికారులు కొనసాగించారు.

దాదాపు 80శాతం కూల్చివేత పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. బుధవారం ఉదయం వర్షం కురుస్తుండడంతో కాస్త అంతరాయం కలిగినప్పటికీ.. ఆ తర్వాత కూల్చివేత కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు సమ్మెట్లతో రంగంలోకి దిగారు. 

మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లను తీసుకువచ్చారు. తొలుత ప్రజా వేదిక ముందు ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చివేశారు. నిజానికి బుధవారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించాలని సంకేతాలు అందినా అనూహ్యంగా నిన్న రాత్రే పని మొదలుపెట్టారు. ప్రజావేదిక, కరకట్టను భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. కూల్చివేతను సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ పర్యవేక్షిస్తున్నారు.