Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా : ప్రబోధానంద సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డికి ప్రబోధానంద స్వామికి మద్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని...రౌడీలకు, గూండాలకు అది నిలయంగా మారినట్లు జెసి ఆరోపించారు.అంతేకాదు ప్రబోధానంద మరో డేరా బాబా అంటూ విమర్శించారు.  
 

prabodhananda sensational comments
Author
Tadipatri, First Published Sep 22, 2018, 2:45 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డికి ప్రబోధానంద స్వామికి మద్య కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని...రౌడీలకు, గూండాలకు అది నిలయంగా మారినట్లు జెసి ఆరోపించారు.అంతేకాదు ప్రబోధానంద మరో డేరా బాబా అంటూ విమర్శించారు.  

అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు మౌనంగా వున్న ప్రబోధానంద సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన అనంతపురం రాజకీయాల్లో సంచలనంగా మారింది.  అంతే కాదు జెపి బ్రదర్స్ పైనా తీవ్ర ఆరోపణలు చేశారు ప్రబోధానంద.

జెసి దివాకర్ రెడ్డి పలుమార్లు తమ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రబోధానంద గుర్తు చేశారు. చివరగా 2008 లో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆ తర్వాత జెసి తమ నుండి డబ్బులు ఆశించడంతో పాటు విధేయులుగా ఉండాలని భావించారని అన్నారు. అందుకు తాము ఒప్పుకోకపోవడంతో గత మూడేళ్లుగా వివిధ పద్దతుల్లో వేదింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కరెంట్, వాటర్ కట్ చేయడంతో పాటు ఇసుక లారీలపై పోలీసు కేసులు పెట్టించారని అన్నారు. వీటికి భయపడకపోవడంతో ఇలా ఆశ్రమం పక్కనున్న గ్రామస్థులను రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పారని ప్రబోధానంద ఆరోపించారు.

జెసి ఆరోపిస్తున్నట్లు ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం లేదని ప్రబోధానంద స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలే జరిగితే భక్తులు ఇంత పెద్దఎత్తున ఎలా వస్తారని ప్రశ్నించారు. ఆశ్రమంలో ప్రవచనాలను మాత్రమే బోధిస్తామని అన్నారు. ఆత్మరక్షణ కోసమే తన భక్తులు గ్రామస్థులతో ఘర్షణ పడినట్లు తెలిపారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఇనుప రాడ్లు, కట్టెలు సెంట్రింగ్ పనుల కోసం తీసుకువచ్చినవని ప్రబోధానంద వివరించారు.

సంబంధిత వార్తలు

అందుకే జేసి కక్షగట్టాడు...వినాయక నిమజ్జనం ఘటన సాకు మాత్రమే : ప్రబోధానంద

 

Follow Us:
Download App:
  • android
  • ios