అనంతపురం: త్రైత సిద్దాంతకర్తగా పేరొందిన ప్రబోధానంద గురువారం నాడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని చిన్నపొడమల కేంద్రంగా త్రైత సిద్ధాంతం ప్రచారం కోసం ప్రబోధానంద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ఆశ్రమం ద్వారా త్రైత సిద్దాంతాన్ని ఆయన ప్రచారం చేసేవాడు. 

ప్రబోధానంద ఇవాళ అస్వస్థతకు గురయ్యాడు. ఆశ్రమం నుండి ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన మార్గమధ్యలోనే మృతి చెందినట్టుగా ఆశ్రమ వాసులు తెలిపారు.

తాడిపత్రిలో శ్రీకృష్ణ మందిరాన్ని కూడ ఆయన స్థాపించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లోఉన్న  సారాంశం ఒక్కటే అని ప్రబోధానంద ప్రచారం నిర్వహించేవాడు. త్రైత సిద్దాంతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆయన పలు పుస్తకాలను  ఆయన రాశాడు. ప్రబోధానంద వివాదాస్పద బోదనలు, అభిప్రాయాలతో పలు విమర్శలను కూడ ఎదుర్కొన్నారు. 

2018లో ఆశ్రమవాసులకు, గ్రామస్థులకు మధ్య గొడవ జరిగింది.ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తుల తరపున నిలబడ్డాడు. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి  ప్రబోధానంద ఆశ్రమానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఈ విషయమై కేసులు కూడ నమోదయ్యాయి.