మచిలీపట్టణంలో విషాదం: పబ్జీ గేమ్‌లో ఓటమితో సూసైడ్ చేసుకున్న యువకుడు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలో పబ్జీ గేమ్ లో ఓటమి పాలైన ప్రభు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో Pubg గేమ్ లో ఓటమి పాలైనందుకు మనోవేదనకు గురైన 16 ఏళ్ల Prabhu అనే యువకుడు ఫ్యాన్ కు ఉరివేసుకొని Suicide పాల్పడ్డాడు.
Mobile లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడి Minor బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు.
దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. . సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడ దేశ విదేశాల్లో కూడా పబ్జీ గేమ్ కు పలువురు బలైన ఘటనలు చోటు చేసుకొన్నాయి. పబ్జీ గేమ్ కు బానిసైన ఓ బాలుడు ఏకంగా తన కుటుంబ సభ్యులను కడతేర్చాడు. తల్లి, సోదరుడుతో పాటు ఇద్దరు సోదరీమణులను కాల్చిచంపాడు. ఈ దారుణ ఘటన Pakistanలో ఈ ఏడాది జనవరి 29న జరిగింది. పోలీసులు లాహోర్ లోని కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్ ముబారక్ (45) హెల్త్ వర్కర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ళ క్రితమే భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది.
అయితే 14 ఏళ్ల కుమారుడు నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ దానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో తల్లి పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయమై కుమారుడిని ఘటన జరిగిన రోజు మళ్లీ మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కప్ బోర్డ్ లో ఉన్న గన్ తీసుకుని తల్లితో పాటు సోదరుడు (22), ఇద్దరు సోదరీమణులు లను కాల్చి చంపాడు.
ఆ తర్వాత తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటి వారికి తెలిపాడు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకు ఏమీ తెలియదని ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపైన ఉన్నానని బాలుడు బుకాయించాడు అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో నిజం అంగీకరించాడు.
హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. సంఘటన సమయంలో అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పబ్జి కి బానిసై పోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం తరలించినట్లు తెలిపారు.
2021 నవంబర్లో భారత్ లోని ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇలాంటి ఘటనే జరిగింది. పబ్జి గేమ్ ఇద్దరు మైనర్ పిల్లల ప్రాణాలు తీసింది. చుట్టూ పరిసరాలను పట్టించుకోకుండా ట్రాక్ పై పబ్జి ఆడుతున్న ఇద్దరు బాలలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో వారిద్దరూ ట్రాక్ పైన విగతజీవి అయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వారు చూసేసరికి ఒక ఫోన్ లో పబ్జి గేమ్ రన్ అవుతుండటం స్థానికులు గమనించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మాథుర-కాస్ గంజ్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పై నవంబర్ 21న చోటుచేసుకుంది.
మాథురలోని లక్ష్మీ నగర్ ఏరియాకు చెందిన వీరిద్దరి పదో తరగతి చదువుతున్నారు. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరారు. అయితే వారు రైల్వే ట్రాక్ వాకింగ్ చేస్తూ, ఆన్లైన్ గేమ్ పబ్జి ఆడుతూ పట్టాలపై నడుస్తున్నారు. దీంతో రైల్వే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు శబ్దం కూడా వారికి తెలియకుండా పోయింది. ఆ గూడ్స్ ట్రైన్ వారి మీద నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆ పిల్లలు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.