Asianet News TeluguAsianet News Telugu

కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ:తెలంగాణ సర్కార్‌ పై ఫిర్యాదు


శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం  కేఆర్ఎంబీకి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.

Power generation: AP seeks action against Telangana
Author
Guntur, First Published Sep 23, 2021, 11:18 AM IST

అమరావతి: కేఆర్ఎంబీ( KRMB)కి ఆంద్రప్రదేశ్ (AP government) ప్రభుత్వం గురువారం నాడు  లేఖ రాసింది.  శ్రీశైలం (srisailam) నాగార్జునసాగర్ (nagarjunasagar)  ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. 

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీరు వృధా అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. విద్యుత్ ఉత్పత్తికి వాడిన 113 టీఎంసీల నీటిని తెలంగాన వాటాలో కలపాలని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. బోర్డు నిర్ణయాలు, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం  ఆ లేఖలో ఆరోపించింది. నిబంధనలు  ఉల్గంఘిస్తున్న తెలంగాణకు జరిమానా వేయాలని  ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా జల జగడం కొనసాగుతుంది. రెండు రాష్ట్రాలు నీటి వాటాల విషయంలో పరస్పరం ఫిర్యాదు చేసుకొంటున్నాయి. అనుమతులు లేని ప్రాజెక్టులపై కూడ రెండు రాష్ట్రాలు  కేంద్ర ప్రభుత్వానికి కూడ ఫిర్యాదులు చేశాయి.

 

Follow Us:
Download App:
  • android
  • ios