Ponnur assembly elections result 2024: పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Ponnur assembly elections result 2024:  గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోట. టిడిపి ఏర్పాటు నుండి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ తెలుగు దేశం పార్టీదే గెలుపు... మధ్యలో ఓసారి కాంగ్రెస్, గత అసెంబ్లీ ఎన్నికల్లో  వైసిపి విజయం సాధించింది.  

Ponnur assembly elections result 2024 KRJ

Ponnur assembly elections result 2024: పొన్నూరు రాజకీయాలను గత మూడు దశాబ్దాలుగా ధూళిపాళ్ల కుటుంబమే శాసిస్తోంది. మొదట కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల వీరయ్య 1982 లో టిడిపి ఆవిర్భావం తర్వాత పార్టీ మారారు. ఇలా 1983 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి తిరిగి పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని వరుసగా ఐదుసార్లు (1994-2019) పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసారు.  కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య చేతిలో తొలిసారి ఓడిపోయారు. 

పొన్నూరు నియోజకవర్గంలోని మండలాలు :

1. పొన్నూరు 
2. చేబ్రోలు
3. పెదకాకాని

పొన్నూరు నియోజకవర్గ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) : 

నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,28,234

పురుషులు 1,10,398

మహిళలు 1,17,818

పొన్నూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :

 వైసిపి అభ్యర్థి :   అంబటి మురళి    

 టిడిపి అభ్యర్థి :  ధూళిపాళ్ల నరేంద్ర

పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ 32915 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  
 

పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో 1,90,849 (83 శాతం) ఓట్లు పోలయ్యాయి. 

వైసిపి - కిలారి వెంకట రోశయ్య - 87,570 (45.88 శాతం) - 1,112 మెజారిటీ - విజయం 

టిడిపి - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - 86,458 (45.3 శాతం) ఓటమి 

జనసేన - బోణి పార్వతి ‌- 12,033 (6.3 శాతం) - మూడో స్థానం  

 పొన్నూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 : 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2014 లో పొన్నూరు ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,76,251 (84 శాతం) ఓట్లు పోలయ్యాయి.  

టిడిపి - ధూళిపాళ్ల నరేంద్ర - 88,386 (50 శాతం) - 7,761 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - రావి వెంకట రమణ - 80,625 (45 శాతం) ‌‌- రెండోస్థానంతో ఓటమి 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios