మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె భర్తను హతమార్చేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన అచ్యుతరావు అనే వ్యక్తిపై తాడేపల్లి మండలం గుండిమెడలో ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు.

మంగలి కత్తితో దాడి చేసిన నిందితులు.. అచ్యుతరావు వద్ద నుంచి 42 వేల నగదు, రెండు మొబైల్స్ దోచుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దారి దోపిడి కోణంలో దర్యాప్తు చేశారు.

అయితే పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుబ్బారావు అనే వ్యక్తి అచ్యుతరావు భార్యపై కన్నేసి అమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తుల తేలింది.

ఈ క్రమంలో అచ్యుతరావుపై దాడి చేసేందుకు నిందితులతో సుబ్బారావు లక్ష రూపాయల బేరం కుదుర్చుకున్నాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు.