Asianet News TeluguAsianet News Telugu

కర్నూల్‌లో స్కార్పియాను వెంబండించిన పోలీసులు: అడవిలోకి దుండగులు

కర్నూల్ జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న స్కార్పియోను  పోలీసులు బుధవారం నాడు వెంబడించారు. దుండగులు  వాహనాన్ని వదిలేసి నల్లమల అడవిలోకి పారిపోయారు.  ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

police tries to catch suspected persons in Kurnool district lns
Author
Kurnool, First Published Jul 14, 2021, 4:19 PM IST


కర్నూల్: కర్నూల్ జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాన్ని పోలీసులు వెంబడిండచడంతో వాహనంలో ఉన్నవారంతా పారిపోయారు. ఏపీకి చెందిన  ఓ మంత్రి పేరును స్కార్పియో వాహనంపై రాసి ఉంది. బైక్  నెంబర్ ను స్కార్పియోకు ఉపయోగిస్తున్నారు. ఆళ్లగడ్డ మండలంలో స్కార్పియో  వాహనంలో  నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండా పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో సిరివెళ్ల పోలీసులు  స్కార్పియోను వెంబడించారు.

పోలీసులను చూసిన దుండగులు  మిట్టపల్లి వద్ద వాహానాన్ని వదిలి నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.గోవిందపల్లిలో ఈ వాహనంలో దుండగులు తిరగడంతో ఓ కాంట్రాక్టర్ ను హత్య చేసేందుకు దుండగులు ఏమైనా వచ్చారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని టీడీపీ  నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దుండగులు ఎందుకొచ్చారనే విషయమై బయటపెట్టాలని ఆయన కోరారు. కుట్రపై పూర్తిస్థాయిలో  దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇల్లీగల్‌ ఏదో ప్లాన్ చేసినట్టుగా అర్ధం అవుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios