వంశీకి..డేటింగ్ యాప్ లో సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరు మధ్య  స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.

డేటింగ్ యాప్ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మరణానికి కారణమైంది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ యువకుడే.. ఈ విద్యార్థిని దారుణంగా చంపేయడం గమనార్హం. కాగా.. ఈ హత్య కేసును తాజాగా పోలీసులు చేధించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వంశీ అనే విద్యార్థి 2019లో దారుణ హత్యకు గురయ్యాడు. కాగా.. అతని హత్య కేసును తాజాగా.. పోలీసులు చేధించారు. వంశీకి..డేటింగ్ యాప్ లో సత్యనారాయణ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరువాత ఇద్దరు మధ్య స్వలింగ సంపర్కం జరిగాక డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘతుకానికి పాల్పడ్డాడు.

చింతలసత్యనారాయణ, కొనకళ్ల వంశీ రాత్రి 7 గంటల సమయంలో పోతవరం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కలిశారని..వంశీ రూ.5 వేలు ఇవ్వక పోవడంతో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతిని తండ్రిని సత్యనారాయణ లక్ష రూపాయలు డిమాండ్‌ చేసి 40 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగాడబ్బులు తీసుకునే క్రమంలో సత్యనారాయణ ను అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు.