తల్లి రెండో పెళ్లి.. అన్న ఇంటికి వెళితే.. వదిన కాలనాగులా..
అండగా ఉండాల్సిన వదిన జ్యోతి ఆమెను సింగరాయకొండకు చెందిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు కె.మాధవికి కొంతకాలం కాంట్రాక్టుకి రూ.25వేలకు బాలికను అమ్మేసింది.
అండగా ఉంటారని అన్న ఇంటికి చేరింది. అక్కడ వదిన తల్లి లాగా ఆదరిస్తుందని భావించింది. కానీ... ఆమె బాలిక పట్ల శాపంగా మారింది. కాలనాగులా మారి బాలికను కాటు వేయాలని చూసింది. బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది. ఎట్టకేలకు పోలీసుల సాయంతో బాలిక విముక్తురాలయింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని ముసునూరుకి చెందిన బాలిక...తన తల్లి రెండో పెళ్లి చేసుకోవటంతో కావలిలో ఉంటున్న తన అన్నా, వదినల వద్దకు చేరింది. అండగా ఉండాల్సిన వదిన జ్యోతి ఆమెను సింగరాయకొండకు చెందిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు కె.మాధవికి కొంతకాలం కాంట్రాక్టుకి రూ.25వేలకు బాలికను అమ్మేసింది.
ఆ బాలికను కందుకూరు-సింగరాయకొండ రోడ్డులో శివారులోని గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల సమీపంలో ఓ ఇంటిలో నిర్బంధించి అన్నం పెట్టకుండా మాధవి వేధించింది. ఎలాగో బాలిక 100కి ఫోన్ చేయటంతో వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. కందుకూరు సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లి బాలికను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ వ్యవహారంలో వ్యభిచార గృహం నిర్వాహకురాలు మాధవితో పాటు బాలిక వదిన జ్యోతి, శ్రీకాంత్ అనే యువకుడిని, ఇంటి యజమాని ఆర్.నరసింగరావుని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు.