అనంతపురం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి గ్రామ శివారులో మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న వ్యవసాయ క్షేత్రంలో పేకాట స్థావరాన్ని గుర్తించారు.

అక్కడ పేకాట ఆడుతున్న 10 మంది పరిటాల అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని, నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పరిటాల సునీత ముఖ్య అనుచరుడు రామ్మూర్తి నాయుడు ఉన్నట్లు సమాచారం​.