పోస్టింగులు కోసం కక్కుర్తిపడి అధికారి పార్టీ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని, కర్తవ్య నిర్వహణలో పోస్టింగ్ ఒక భాగమే తప్ప, పోస్టింగుల కోసమే అధికారులు పనిచేయరని ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు. 

నిజాయితీ, పట్టుదల,కర్తవ్య దీక్ష వీటిని పోస్టింగులకు ప్రామాణికంగా వ్యవహరిస్తారు తప్ప పార్టీ చెప్పినట్టు వింటే కాదని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల పోలీసుల మనో ధైర్యం దెబ్బతింటుందని, ఇలా వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు మానుకోవాలని హితవు పలికారు. 

ప్రజల రక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు చట్టాన్ని అనుసరించి పోలీసులు పనిచేస్తారే తప్ప, ఎవరో ఒకరి స్వార్థ ప్రయోజనాలకు కొమ్ము కాయరని వారు తెలిపారు.