కాల్చుకొంటే కాల్చండి: అడ్డుకొన్న పోలీసులపై పవన్ ఫైర్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను మందడం గ్రామానికి సమీపంలో పోలీసులు అడ్డుకొన్నారు.
అమరావతి: రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మంగళవారం నాడు పోలీసులు షాకిచ్చారు.మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకొంటూ మందడం వైపు వెళ్లారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఎర్రబాలెలం నుండి కృష్ణాయపాలెం మీదుగా మందడం గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. తొలుత ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ రైతులతో ముచ్చటించారు.
Also read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్
కృష్ణాయపాలెం నుండి మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు. ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారిన పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు.
ఈ సమయంలో జనసేన కార్యకర్తలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. సచివాలయంలోనే సీఎం ఉన్నందున మందడం వెళ్లకుండా తుళ్లూరు వెళ్లాలని పవన్ కళ్యాణ్ కు పోలీసులుసూచించారు. కానీ వపన్ కళ్యాణ్ మందడం వైపు వెళ్తున్నారు.
అయితే ఈ సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. తాను మందడం వెళ్తానని తేల్చి చెప్పారు. తాను మందడం వెళ్తానని తేల్చి చెప్పారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాల్చితే కాల్చుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పోలీసులపై మండిపడ్డారు.
దీంతో పవన్ కళ్యాణ్ కారు దిగి నడుచుకొంటూ మందడం వైపుకు వెళ్లారు. పవన్ కళ్యాణ్‌ను మందడం వైపు రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై మందడం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.