Asianet News TeluguAsianet News Telugu

కొయ్యూరు వద్ద ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోల మృతి

విశాఖ జిల్లాలోని కొయ్యూర్ వద్ద బుధవారం నాడు ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.  ఈ ఘటనలో ఆరుగురు  మావోయిస్టులు మృతి చెంారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

Police Maoist exchange fire in Vizag Agency lns
Author
Visakhapatnam, First Published Jun 16, 2021, 11:42 AM IST

విశాఖపట్టణం: వివిశాఖ జిల్లాలోని కొయ్యూర్ వద్ద బుధవారం నాడు ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.  ఈ ఘటనలో ఆరుగురు  మావోయిస్టులు మృతి చెంారని సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది ఘటన స్థలంలో ఏకే 47 సహా భారీగా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మావోలు, పోలీసులకు మధ్య  కాల్పులు కొనసాగుతున్నాయి.

 

 

కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో  ఇవాళ  ఉదయం కూంబింగ్ చేస్తున్న  పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకొన్నాయి.  ఘటన స్థలంలో ఏకే 47 లభ్యం కావడంతో కీలకమైన నేత ఇక్కడే ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డివిజన్ స్థాయి నేత వద్దే ఏకే 47 ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించారని  సమాచారం. విశాఖ జిల్లాలో  మావోయిస్టులు, పోలీసులకు జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.  మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నారని అనుమానిస్తున్నారు. ఘటనస్థలానికి భారీగా గ్రేహౌండ్్స బలగాలను తరలిస్తున్నారు.  మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు.

ఈ ఎన్‌కౌంటర్ లో మరణించినవారిలో తెలంగాణకు చెందిన సందె గంగయ్య ఉన్నాడని అనుమానిస్తున్నారు. సందె గంగయ్య డీసీఎం కమాండర్ గా ఉన్నాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. గంగయ్య ఉపయోగించే ఏకే 47 సంఘటనస్థలం నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన ఃస్థలంలో ఇంకా మావోలు గాయపడి  ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏకే 47 తో పాటు కార్బన్, రెండు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios