Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్... నిరుద్యోగులకు తీపికబురు చెప్పిన సీఎం జగన్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసులకే కాదు నిరుద్యోగులకు కూడా తీపి కబురు అందించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

police jobs Recruitment Notification Released in December: AP CM YS Jagan
Author
Amaravati, First Published Oct 21, 2021, 10:37 AM IST

విజయవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు, నిరుద్యోగులకు తీపికబురు అందించారు. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని జగన్ ప్రకటించారు. 

ఇక గతంలో ఎవరూ చేయని విధంగా దేశంలో తొలిసారిగా వీక్లీ ఆఫ్ లు అమలు చేశామని... కోవిడ్ వల్ల ఇది కొంతకాలంగా అమలు చేయలేక పోయామన్నారు. ఈరోజు(గురువారం) నుంచి మళ్లీ వీక్లీ ఆఫ్ లను అమలు చేస్తామని జగన్ వెల్లడించారు.

విధినిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ విజయవాడలో  police martyrs remembrance day కార్యక్రమం జరిగింది. ఈ సంస్మరణ కార్యక్రమంలో cm ys jagan తో పాటు హోం మినిస్టర్ mekathoti sucharitha, డిజిపి goutham sawang, ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పాల్గొన్నారు. పోలీస్ అమరుల స్థూపం వద్ద వీరు నివాళులు అర్పించారు.

READ MORE  బోసిడికే అని తిట్టారు, ఆ పదానికి అర్థం లం... కొడుకు: వైఎస్ జగన్ 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...  దేశం మొత్తం నేడు అమరవీరుల దినం జరుపుకుంటున్నామన్నారు. కరంచంద్, ఆయన సహచరుల ధైర్యాన్ని 62యేళ్లుగా గుర్తు చేసుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు సమాజం అండగా ఉంటుందని... గత యేడాది కాలంలో మరణించిన పోలీసు సోదరులకు ప్రభుత్వం తరపున శ్రద్దాంజలి ఘటిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులు కు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

''సమాజం కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసు సేవలను మేం గుర్తించాం. అందుకే గత ప్రభుత్వం 2017నుండి బకాయిపెట్టిన రూ.1500కోట్లను మేము విడుదల చేశాం. అలాగే హోంగార్డుల గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వమే పెంచింది.  పోలీసు శాఖలో‌నూతనంగా 16వేల మందిని గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో నియమించాం'' అని సీఎం తెలిపారు.

''కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షలు మంజూరు చేశాం. మ్యాచింగ్ గ్రాంట్ గా మరో ఐదు లక్షలు ఇస్తున్నాం. దేశంలొ ఎక్కడా లేని విధంగా ఎక్స్ గ్రేషియా, ఇతర సదుపాయాలు కల్పించాం'' అని పేర్కొన్నారు. 

''దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ అమల్లోకి తెచ్చాం. దిశ బిల్లు ను ఉభయ సభలు ఆమోదించి .. కేంద్రం ఆమోదం కోసం పంపాం. మహిళా హోం మంత్రి ఆధ్వర్యంలో అనేక రక్షణ చర్యలు చేపట్టాం. జాతీయ స్థాయిలో ఈ‌సేవలకు ఆదరణ లభిస్తుంది'' అన్నారు.

READ MORE  వాడు వీడు అంటూ లోకేష్, బాబులపై కొడాలి నాని తిట్లదండకం

''పెరుగుతున్న టెక్నాలజీ తో పోలీసులు బాధ్యత లు మరింత విస్తరించాలి. వైట్ కాలర్ నేరాలను నియంత్రించేలా సాంకేతికత ను అందుబాటులో కి తెస్తాం. నేరం కొత్త కొత్త రూపాలలో దాడి చేస్తుంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం లో కొత్త కోణం చూస్తున్నాం. కొత్త నేరగాళ్లు ఎలా చేస్తున్నారో మన కళ్ల ముందే కనిపిస్తుంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం, కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు'' అని జగన్ ఆరోపించారు. 

''ప్రజలకు సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు కోర్టులలో కేసులు వేశారు. ఇళ్ల నిర్మాణం కూడా ఆపి వేయించారు... పేదలకు ఇంగ్లీషు మీడియం దక్కకుండా చేశారు. అబద్దాలనే డిబేట్లుగా ప్రచారం చేయడం పచ్చ చానళ్లు, పచ్చ పత్రిలను చూస్తాం. నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నాం'' అన్నారు. 

''లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ... తన, మన బేధం వద్దు. పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు. బడుగు బలహీన వర్గాలపై దాడి చేస్తే చట్టం ముందు నిలబెట్టాలి. సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపండి. మనందరి ప్రభుత్వానికి మంచి జరగాలని కోరుకుంటున్నా'' అన్నారు సీఎం జగన్. 


 

Follow Us:
Download App:
  • android
  • ios