Asianet News TeluguAsianet News Telugu

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర: భూమా అఖిలప్రియ భర్తకు నోటీసులు

టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు జరిగిన కుట్ర కేసులో పోలీసులు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని భార్గవ్ కు పోలీసులు సూచించారు.

Police issue notice to Bhuma Akhilapriya;s husband Bhargav
Author
Kadapa, First Published Jun 6, 2020, 7:04 AM IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశఆరు. ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేత, ఏపీ సీడ్స్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ ఎవీ సుబ్బారెడ్డి హత్యకు జరిగిన కుట్ర కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో కడప పట్టణంలోని చిన్నచౌక్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

విచారణకు హాజరు కావాలని పోలీసులు అఖిలప్రియ భర్తకు నోటీసులు ఇచ్ాచరు. గతన నెల 15వ తేదీిన మధ్యవర్తిని పోలీసుుల అరెస్టు చేశఆరు. కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. 

ఏవీ సుబ్బారెడ్డి హత్యకు జరిగిన కుట్రను కడప పోలీసులు భగ్నం చేశారు. సుపారీ తీసుకున్న ముగ్గురిని కడప చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో నివాసం ఉంటున్న సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు ఫక్కీర్ కొందరు ప్రముఖ రాజకీయ నేతలతో రూ. 50 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. 

మొదట రూ. 15 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. సుబ్బారెడ్డిని చంపేందుకు మార్చి 12వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకు ఫక్కీర్ ఒంటరిగా వెళ్లాడు. అయితే, ఆ సమయంలో హైదరాబాదు నైట్ పెట్రోలింగ్్ పోలీసుుల తిరుగుతుండడంతో వెనక్కి వచ్చేశాడు. 

కాగా,  తాజాగా సుబ్బారెడ్డి, అఖిలప్రియ పరస్పరం తీవ్రమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసుకున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios