మాచర్లలో టెన్షన్: టీడీపీ నేత జూలకంటి బ్రహ్మరెడ్డి బర్త్ డే వేడుకలపై ఆంక్షలు, పోలీసుల మోహరింపు

మాచర్లలో  టెన్షన్ నెలకొంది.  టీడీపీ నేత జూలకంటి బ్రహ్మరెడ్డి  పుట్టిన  రోజు  వేడుకలపై  పోలీసులు ఆంక్షలు విధించారు.  మాచర్లకు వెళ్లే దారుల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు  చేశారు. 

Police Imposes Restrictions On TDP Leader Julakanti Brahma Reddy Birthday Celebrations  lns

గుంటూరు: టీడీపీకి చెందిన  మాచర్ల  అసెంబ్లీ  నియోజకవర్గ ఇంచార్జీ  జూలకంటి బ్రహ్మరెడ్డి పుట్టిన  రోజు వేడుకలపై   పోలీసులు ఆంక్షలు విధించారు.  మాచర్ల కు వెళ్లే  మార్గాల్లో  పోలీస్ పికెట్లు  ఏర్పాటు   చేశారు  పోలీసులు.  పిడుగురాళ్ల నుండి  మాచర్లకు  భారీ కాన్వాయ్ తో  జూలకంటి బ్రహ్మరెడ్డి  మంగళవారం నాడు  బయలుదేరారు.   నిన్న  రాత్రే  జూలకంటి బ్రహ్మరెడ్డిని  మాచర్ల వదిలివెళ్లాలని పోలీసులు ఆదేశించారు. పోలీసులతో  జూలకంటి  బ్రహ్మరెడ్డి  వాగ్వాదానికి దిగారు. 

జూలకంటి బ్రహ్మరెడ్డి  పుట్టిన రోజు  కావడంతో  మాచర్లలో  టీడీపీ శ్రేణులు   కార్యక్రమాన్ని  ఏర్పాటు  చేశారు.  బ్రహ్మరెడ్డి  పుట్టిన రోజు వేడుకలకు  పోలీసులు   షరతులతో  కూడిన  అనుమతులు  ఇచ్చారు.. టీడీపీ మాచర్ల అసెంబ్లీ  ఇంచార్జీగా జూలకంటి బ్రహ్మరెడ్డిని నియమించిన తర్వాత  ఈ నియోజకవర్గంలో  వైసీపీ, టీడీపీ మధ్య  ఘర్షణలు చోటు  చేసుకుంటున్నాయి.   ఇటీ

గత ఏడాది డిసెంబర్  16వ తేదీన  రాత్రి  మాచర్లలో  టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది.  టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమం సందర్భంగా  ఈ ఘటన  చోటు  చేసుకుంది. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ శ్రేణులు  పరస్పరం ఆరోపణలు  చేసుకున్నాయి.  పల్నాడు  ఎస్పీపై  టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విమర్శలు  చేశారు.  మాచర్లలో  పోలీసులు  వ్యవహరించిన తీరును  చంద్రబాబు తప్పుబట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios