Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రిలో రసవత్తరంగా రాజకీయం: టీడీపీ, వైసీపీలపై కేసులు

తాడిపత్రి మున్సిపాలిటీలో రాజకీయాలు వేడేక్కాయి, తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. వైసీపీ 16 స్థానాలను దక్కించుకొంది.

police files cases against TDP and Ysrcp in Tadipatri lns
Author
Anantapur, First Published Mar 17, 2021, 10:43 AM IST

తాడిపత్రి: తాడిపత్రి మున్సిపాలిటీలో రాజకీయాలు వేడేక్కాయి, తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ 18, సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. వైసీపీ 16 స్థానాలను దక్కించుకొంది.

ఈ మున్సిపాలిటీ ఛైర్మెన్ పదవిని దక్కించుకొనేందుకు గాను టీడీపీ పావులు కదుపుతోంది. తమ పార్టీ కౌన్సిలర్లతో పాటు సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ వెళ్లారు.

తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ, వైసీపీలు అన్ని ప్రయత్నాలను చేస్తున్నాయి. 

ఈ మున్సిపాలిటీలో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను వైసీపీ, టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిదులు ఇచ్చిన లేఖలను మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు.

ఈ విషయమై టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

మరోవైపు తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను తమ పార్టీలో చేరాలని వైసీపీ నేతలు  బెదిరిస్తున్నారని  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పరస్పరం ఫిర్యాదు చేసుకొన్నారు.ఈ ఫిర్యాదులపై  పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios