గుంటూరు: గుంటూరు జిల్లా నిజాంపట్టణం మండలం అడవులదీవిలో ఓ మహిళ అశ్లీల వీడియోలను ప్రైవేట్ టీచర్ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. ఈ  వీడియోలు స్థానికంగా ఉన్న యువత షేర్ చేసుకొన్నారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.దీంతో పోలీసులు వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్ ను పిలిపించారు. అయితే ఈ గ్రూపులో ప్రైవేట్ టీచర్ గుడారయ్య ఈ వీడియోలను పోస్టు చేసినట్టుగా ఆడ్మిన్ తెలిపారు. 

స్థానికంగా ఉన్న మహిళకు చెందిన వీడియోలుగా  ప్రచారం చేశారు. గ్రూప్ అడ్మిన్ ఫిర్యాదు మేరకు  ప్రైవేట్ టీచర్ గుడారయ్యపై  ఫిర్యాదు చేశాడు. 
గ్రూప్ ఆడ్మిన్ పై కూడ పోలీసులు కేసు  నమోదు చేశారు. 

యువతిపై కక్షతోనే ఈ వీడియోలను పోస్టు చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ వీడియోలు గ్రామంలోని గొడవలకు దారితీస్తాయనే గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై పోలీసులు రంగప్రవేశం చేసి ఈ వీడియోల గురించి ఆరా తీస్తున్నారు.