అమరావతి: అమరావతికి సమీపంలోని మందడం జిల్లా పరిషత్ స్కూల్‌లో దుస్తులు మార్చుకొంటున్న మహిళా కానిస్టేబుళ్ల  ఫోటోలు, వీడియోలు తీశారు ముగ్గురు కెమెరామెన్లు.  

స్కూల్ కిటీకీల నుండి రహస్యంగా వీడియోలు తీశారు. ఈ ఘటనపై బాధిత కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు చానెల్స్ కెమెరామెన్లపై నిర్భయ కేసు నమోదు చేసినట్టుగా తెనాలి డిఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు.

పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన మహిళా కానిస్టేబుళ్లకు కేటాయించారు..తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు 

బాధిత మహిళా కానిస్టేబుళ్లు. చైతన్యవంతమైన మీడియా ఈ రకంగా వ్యవహరించడం సరైంది కాదని తెనాలి డిఎస్పీ శ్రీలక్ష్మి మీడియాకు చెప్పారు. తమ స్కూల్‌లో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుళ్లకు కేటాయించినట్టుగా స్కూల్ హెడ్‌ మాస్టర్ కోటేశ్వరరావు చెప్పారు.