జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవగుడి గ్రామ సమీపంలో  జరిగిన ఘర్షణలో సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆదినారాయణ రెడ్డి ఫిర్యాదు చేశారు. 

దీంతో.. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.రెండు రోజుల క్రితం ఆదినారాయణ రెడ్డితోపాటు మరో 80మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read బీజేపీ అభ్యర్ధులకు ఏం కానివ్వను, ఏమైనా జరిగితే రాజీనామా : ఆదినారాయణ రెడ్డి...

కాగా... తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్, సుధీర్ రెడ్డిలపై సంచలన కామెంట్స్ కూడా చేశారు. రాష్ట్రంలో, జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులకు ఏదైనా హాని జరిగితే తనదే బాధ్యత అని, అవసరమైతే బీజేపీకి రాజీనామా చేసైనా సరే పోరాడతామని తేల్చిచెప్పారు. 

మార్చి 14న బీజేపీ అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు దేవగుడికి వచ్చిన వారిని తమ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా తామే దాడి చేశామంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పోలీసులకు సుధీర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.