Asianet News TeluguAsianet News Telugu

కోర్టు ఆదేశాలు.. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు..

సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు.

police filed case against minister ambati rambabu after guntur court orders ksm
Author
First Published Jan 18, 2023, 5:23 PM IST

సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ప్రైవేట్ కేసు ఆధారంగా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఫ్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. 

ఇక, అంబటి రాంబాబు నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి, గుంటూరు నగరంలో సంక్రాంతి లక్కీ డ్రా టిక్కెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున విక్రయిస్తున్నారని గాదె వెంకటేశ్వరరావుఆరోపించారు. మూడు లక్షలకు పైగా టిక్కెట్లను ముద్రించి పార్టీ కార్యకర్తలు, వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా విక్రయిస్తున్నారని అన్నారు. పింఛన్‌ కానుక లబ్ధిదారులను వార్డు వాలంటీర్లు టిక్కెట్లు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన గుంటూరు కోర్టు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో తాజాగా సత్తెనపల్లి పోలీసులు మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios