సత్యసాయి  హిందూపురం జిల్లాలోని  కదిరిలో  యువతిపై అత్యాచారయత్నం చేసిన  ఇద్దరిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.  కానిస్టేబుల్, హోంగార్డు యువతిపై  అత్యాచారానికి ప్రయత్నించారు. 

కదిరి: సత్యసాయి హిందూపురం జిల్లాలోని కదిరిలో యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ , హోంగార్డుపై కేసు నమోదు చేశారు పోలీసులు.కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు కదిరి రైల్వే స్టేషన్ కు చేరుకున్న యువతికి మాయమాటలు చెప్పిన కానిస్టేబుల్ కాయప్ప, హోంగార్డు సుబ్బారెడ్డిలు యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.