అర్థరాత్రి స్టేషన్ కు వచ్చిన బాధితులపై పోలీస్ కానిస్టేబుల్ బూతుపురాణం...

ఆపదలో ఉన్నాం రక్షించమంటూ ఫోన్ చేస్తే బూతుపురాణం విప్పాడో పోలీస్ కానిస్టేబుల్.. అదంతా సెల్ఫోన్ లో రికార్డవ్వడం.. వాయిస్ లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో... 

Police constable abusing language on the victims who came to the station in the middle of the night in visakhapatnam

విశాఖపట్నం : అది సోమవారం అర్ధరాత్రి.. అంతా గాఢనిద్రలో ఉన్నారు.. విశాఖ నగరం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్ ITI జంక్షన్ వద్ద ఉన్న శంకరంపేట ప్రాంతం…  ఏదో పడుతున్నట్లుగా పెద్ద శబ్దాలు రావడంతో ఆ ప్రాంతంలోని పిల్లి చంద్రశేఖర్ దంపతులు ఉలిక్కిపడి లేచారు. బయటకు వచ్చి చూడగా వారి ఇంటి గోడను గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు పడగొడుతున్నారు. దీంతో వారు భయంతో ‘మాకు ప్రాణహాని ఉంది. ప్రమాదంలో ఉన్న మమ్మల్ని రక్షించండి’ అంటూ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న కంట్రోల్ రూమ్ కానిస్టేబుల్ గోవిందు సూచనతో ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లారు.

అక్కడున్న కానిస్టేబుల్ తో విషయం చెప్పారు, ఆయన ఉదయం రావాలి అని అనడంతో బాధితులు అక్కడి నుంచే మళ్లీ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో కానిస్టేబుల్ గోవింద్  బాధితుడి  ఫోన్లోనే కానిస్టేబుల్ తో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన ఫిర్యాదుదారుడు పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటంతో పాటు, అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఫోన్లు చేసి విసిగిస్తున్నాడు అని..  పొద్దున రమ్మని చెప్పి పంపించేయమని, గోడే కదా పగల కొట్టింది.. ప్రాణాలేమీ పోలేదు కదా… రాత్రులు పోలీసుల్ని విసిగించద్దు.. ఇలా అవమానకర రీతిలో మాట్లాడడంతో బాధితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

వీరి మధ్య సాగిన సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ స్పందించారు.  బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరించి దుర్భాషలాడిన సంఘటనను తీవ్రంగా పరిగణించారు. సంబంధిత హెడ్కానిస్టేబుల్ నెంబర్ 1145 బి. గోవింద్ ను కంట్రోల్ రూమ్ విధుల నుంచి తప్పించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే హెడ్కానిస్టేబుల్ ను..  ఆర్మూరు రిజర్వు విభాగానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఛార్జి మెమోలు జారీ చేశామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి హెడ్కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది పోలీస్స్టేషన్లో ఆశ్రయించే ప్రజలు, ఫిర్యాది దారుల పట్ల మర్యాదతో నడుచుకోవాలని సూచించారు. 
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని కంచరపాలెం సీఐ కృష్ణారావుకు సీపీ ఆదేశించారు.
 
కోర్టు సూచనల మేరకు…
ఈ ఘటనపై చంద్రశేఖర్ భార్య ఇచ్చిన ఫిర్యాదును కంచరపాలెం  పోలీసులు తీసుకుని ఆమెకు రసీదు ఇచ్చారు. అయితే ఇది సివిల్ వ్యవహారం కావడంతో (కేసు పెట్టదగినది కాకపోవడం) పోలీసులు కేసు నమోదు చేయకుండా, దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు సూచించారని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. న్యాయస్థానం సూచించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios