శెభాష్ పోలీస్ : తాగి పడిపోయిన యువకుడిని ఆదుకున్న కానిస్టేబుల్.. (వీడియో)
తమది కరుడు గుండెలే కావు, ఆపద వస్తే ఆదుకునే మంచి మనసు అని మచిలీపట్నం రాబర్ట్ సన్ పేట పోలీసు ఒకరు నిరూపించారు. మంగళవారం రాత్రి మత్తులో రోడ్డుకు అడ్డంగా పడున్న ఒక యువకుడు ఆదుకున్నారు ఆర్ పేట కానిస్టేబుల్ డి.శ్రీనివాస్.
తమది కరుడు గుండెలే కావు, ఆపద వస్తే ఆదుకునే మంచి మనసు అని మచిలీపట్నం రాబర్ట్ సన్ పేట పోలీసు ఒకరు నిరూపించారు. మంగళవారం రాత్రి మత్తులో రోడ్డుకు అడ్డంగా పడున్న ఒక యువకుడు ఆదుకున్నారు ఆర్ పేట కానిస్టేబుల్ డి.శ్రీనివాస్.
"
మచిలీపట్నంలో సాయంత్రం 7 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు స్వచ్ఛందంగా దుకాణాల బంద్ పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు అనధికారిక కర్ఫ్యూతో అత్యధిక శాతం మంది ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉండే మూడు రోడ్ల కూడలిలో ఓ యువకుడు నడిరోడ్డుపై మద్యం మత్తులో అచేతనంగా పడి ఉన్నాడు.
మచిలీపట్నం రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ డి. శ్రీనివాస్ నైట్ బీట్ డ్యూటీ చేసేందుకు అటుగా సైకిల్ మీద వెడుతూ అతన్ని గమనించారు. దాహం అంటూ గొణుగుతూ గొంతు తడారిపోయి రొప్పుతూ రోడ్డుపై పడి ఉన్న యువకుడిని చూడగానే విషయం అర్థమైంది.
అంతేకాదు ఏదైనా వాహనం పొరపాటున ఆ వ్యక్తిని ఢీ కొడితే జరిగే ప్రమాదాన్ని ఊహించి వెంటనే తన సైకిల్ రోడ్డు పక్కన పెట్టి ఆ యువకుని వద్దకు వెళ్ళి నడుం చుట్టు చేతులు వేసి బలవంతాన పైకి లేపి రోడ్డు దాటించి మున్సిపల్ కార్యాలయం పక్కన సురక్షితమైన స్థలంలో పడుకోబెట్టాడు కానిస్టేబుల్ శ్రీనివాస్.
ఆ తర్వాత ఒక బాటిల్ నీళ్లతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడి మొహం పై చెల్లి తట్టి లేపాడు. ఇంటి అడ్రస్సు తదితర సమాచారం అడిగాడు.. మీ ఇంటికి క్షేమంగా పంపిస్తాను.. వెళతావా ? అని ప్రశ్నించారు. మత్తులో జోగుతున్న అతని గురించి తనకెందుకు అనుకోకుండా ఎంతో మానవత్వం ప్రదర్శించిన కానిస్టేబుల్ డి. శ్రీనివాస్ దయార్థ హృదయాన్ని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.