Asianet News TeluguAsianet News Telugu

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. కాకినాడ కోర్టు సమయం ముగియడంతో మొబైల్ కోర్టు జడ్జి ఇంటి ముందు పోలీసులు అనంతబాబును ప్రవేశ పెట్టారు

Police conducted health checkup to MLA anantha babu at Kakinada hospital
Author
Guntur, First Published May 23, 2022, 6:13 PM IST

కాకినాడ: డ్రైవర్ Subramanyam హత్య కేసులో YCP ఎమ్మెల్సీ Anatha Babu అలియాస్ ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబును సోమవారం నాడు సాయంత్రం పోలీసులు  స్పెషల్ మొబైల్ జ్యుడిషీయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చూపారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తో పాటు సుబ్రమణ్యం స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తోపాటు మరో ముగ్గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం.ఈ విషయమై డీఐజీ  పాల్ రాజు మీడియాకు వివరించే అవకాశం ఉంది. 

. kakinada  కోర్టుకు సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్ ఇంట్లో  ఎమ్మెల్సీ అనంతబాబును హాజరుపర్చనున్నారు.. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండి అనంతబాబును వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించాలని భావించారు.. అయితే మార్గమధ్యలో పోలీసులు ఎమ్మెల్సీని తరలిస్తున్న వాహనాలను సర్పవరం వైపునకు మళ్లించారు. సర్పవరం గెస్ట్ హౌస్ నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్సీని తరలించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత  జడ్జి ఇంటికి అనంతబాబును  తరలించనున్నారు. ఈ మేరకు జడ్జికి సమాచారం పంపారు. మరో వైపు జడ్జి ఇంటి వద్ద దిశ డీఎస్సీ మురళీమోహన్  జడ్జి ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

YC MLC  అనంతబాబు తమ అదుపులో ఉన్నట్టుగా కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ సోమవారం నాడు మధ్యాహ్నం ప్రకటించారు.  ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ విషయాన్ని శాసనమండలి చైర్మెన్ కు పోలీసులు సమాచారం ఇచ్చారు. మరో వైపు అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఈ విషయమై పోలీసులు సమాచారం పంపారు.

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తో పాటు సుబ్రమణ్యం స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తోపాటు మరో ముగ్గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం.ఈ విషయమై డీఐజీ  పాల్ రాజు మీడియాకు వివరించే అవకాశం ఉంది.  

ఈ నెల 20వ తేదీన తెల్లవారుజామున సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ అనంతబాబు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే డెడ్ బాడీతో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో వచ్చాడు. సుబ్రమణ్యం తల్లిదండ్రులు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి కారులో సుబ్రమణ్యం డెడ్ బాడీని వదిలి వెళ్లాడు.

also read:మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టుగా అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు..!

ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళనలు చేయడంతో ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో సుబ్రమణ్యం డెడ్ బాడీ పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరో వైపు సుబ్రమణ్యంది హత్యేనని పోస్టుమార్టం నివేదిక తేల్చింది.ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ఆదివారం నాడు రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యం హత్యకు దారి తీసిన పరిస్థితులను పోలీసుల విచారణలో వివరించారు.

తన వ్యక్తిగత విషయాల్లో డ్రైవర్ సుబ్రమణ్యం జోక్యం చేసుకొంటున్నాడని అంతేకాదు తనను బ్లాక్ మెయిల్ చేశాడని కూడా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని సమాచారం. ఈ విషయమై పోలీసులు మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios