Asianet News TeluguAsianet News Telugu

మాచర్ల అల్లర్లు : డీజీపీ ఆఫీసులో టీడీపీ మాజీ మంత్రుల ఫోన్ లు తీసుకుని, తలుపులు మూసేసి.. హైడ్రామా...

గుంటూరులో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాచర్లలో టీడీపీ నేతల మీద దాడుల నేపథ్యంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మాజీ మంత్రులు, నాయకులను రాకుండా తలుపులు మూసేశారు.

police closed the doors for former TDP ministers, leaders in the DGP office, guntur
Author
First Published Dec 19, 2022, 7:42 AM IST

గుంటూరు : మాచర్ల అల్లర్ల నేపథ్యంలో గుంటూరులో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసు అధికారులను కలవడానికి వచ్చిన టీడీపీ మాజీ మంత్రులకు చేదు అనుభవం ఎదురయింది. వారిని పోలీస్ స్టేషన్ లోకి రాకుండా తలుపులు వేసి అడ్డుకున్నారు. ఫోన్ లు తీసుకుని, తలుపులు మూసేసి.. అడ్డుకుని.. పోలీసులు మంత్రులను అగౌరపరిచారు. ఆదివారం గుంటూరు రేంజ్ డీఐజీ  ఆఫీసులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

ఆదివారం సాయంత్రం.. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బోండా ఉమా, కొల్లు రవీంద్రలు.. వీరితో పాటు పార్టీ నాయకులైన కోవెలమూడి నాని, జీవీ ఆంజనేయులు, నసీర్, చిట్టి బాబు, శ్రీనివాస రావు, డేగల ప్రభాకర్ తదితరులతో కలిసి మాచర్లలో టీడీపీ నాయకులపై జరిగిన దాడి గురించి డీజీపీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఆదివారం సాయంత్రం డిజిపి కార్యాలయానికి చేరుకున్న వీరంతా తాము వచ్చినట్టు డీజీపికి తెలపాలని అక్కడి సిబ్బందికి చెప్పారు. ఈ సమయంలో డీజీపీ  త్రివిక్రమ వర్మ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. 

నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి.. ఆ పోలీసు అధికారులను బదిలీ చేయాలి : టీడీపీ

అయితే మాజీ మంత్రులు, నాయకులు డిజిపి కోసం ఆఫీసు దగ్గర 45 నిమిషాల పాటు ఎదురు చూశారు. ఆ తర్వాత కాసేపటికి డీఐజీ వస్తున్నారని ఇక్కడ ఎవరూ ఉండకూడదని.. అందరి వెళ్లిపోవాలని పోలీసులు వారికి చెప్పారు. దీంతో మాజీ మంత్రులు, నాయకులు అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే అలాకాదు డీజీపీ ఆఫీసు ప్రాంగణంలో ఎవరు ఉండకూడదని.. ప్రాంగణం దాటి బయటికి వెళ్లి పోవాలని సూచించారు. దీంతోపాటు పోలీసులు మాజీ మంత్రుల మీదికి దూసుకు వచ్చారు. 

ఇంతలోనే అక్కడికి చేరుకున్న డీజీపీ.. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డితో కలిసి కార్యాలయంలోకి వెళ్ళిపోయారు. ఇది గమనించిన మాజీ మంత్రులు ఆయన వెనకే వెళ్లడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు తలుపులు మూసేశారు. అది చూసిన మాజీ మంత్రులు, టీడీపీ నేతలు.. షాక్ అయ్యారు.  తాము వస్తుంటే తలుపులు మూసి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఒక ఐదుగురిని మాత్రమే లోపలికి పంపించారు. ఆ అయిదుగురు మాజీమంత్రులు లోపలికి వెళ్లగానే వారి దగ్గర సెల్ఫోన్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత బయట ఉన్న పోలీసులు తలుపులు మూసేశారు.  దీంతో కాసేపు హైడ్రామా నడిచింది. పోలీసుల ఈ చర్యపై టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios